
క్రిష్ణపట్నం ఆనందయ్య కంటి చుక్కల మందు పంపిణీపై తీర్పును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజర్వు చేసింది. కంటి మందు విషయంలో నిపుణుల కమిటీ నివేదిక రావాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది. నిపుణుల ఆమోదం లేకుండా కంటి మందుకు అనుమతి ఇవ్వలేమని వివరించింది.
అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి కంటి మందుకు అనుమతి ఇస్తారా? అని కోర్టు ప్రశ్నించగా.. అప్పుడు అందరూ అత్యవసర పరిస్థితి అంటూ వస్తారని ప్రభుత్వం తెలిపింది. చుక్కల మందుకోసం రోజుకు 15 నుంచి 20 మంది మాత్రమే వస్తున్నారని ఆనందయ్య తరఫు న్యాయవాది అశ్వనీకుమార్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఆనందయ్య మందును వ్యతిరేకించడం లేదన్న ప్రభుత్వం తరఫు న్యాయవాది …. కంటి మందుకు తప్ప మిగతా వాటికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. నిపుణల కమిటీ నివేదిక వచ్చేందుకు 3 వారాల సమయం కావాలని ప్రభుత్వం కోరింది. దీంతో ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించింది.





