మీడియా నిజాన్ని నిర్భయంగా వెల్లడించాలి : RSS అఖిల భారతీయ సహ ప్రచార ప్రముఖ్ శ్రీ నరేంద్ర కుమార్
మీడియాకు ఎలాంటి జెండాలు ఉండరాదని, నిజాన్ని నిర్భయంగా వెల్లడించడమే మీడియాకున్న ఏకైక అజెండా అని ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ సహ ప్రచార ప్రముఖ్ శ్రీ నరేంద్ర కుమార్ తెలిపారు.
ఆదివారం జరిగిన ఒక వెబినార్ ని ఉద్దేశించి ప్రసంగిస్తూ శ్రీ నరేంద్ర కుమార్…… మీడియా అర్థ సత్యాలను చెప్పడం మానుకోవాలని హితవు పలికారు.
“ప్రస్తుత పరిస్థితులలో మీడియా పాత్ర” అనే అంశంపై ప్రసంగిస్తూ ఆయన ప్రస్తుతం నెలకొన్న కరోనాలాంటి సంక్షోభాలను ఎదుర్కోవడం కేవలం ప్రభుత్వాల మరియు ప్రభుత్వ యంత్రాంగాల బాధ్యత మాత్రమే కాదని సమాజంలోని ప్రతి ఒక్కరి కర్తవ్యమని తెలిపారు.
“వ్యవస్థలో లోటుపాట్లు ఏర్పడడం సహజం. వాటిని సరిదిద్దడానికి మాత్రమే ఆ లోటుపాట్లను వెలుగులోకి తేవాల్సి ఉంటుంది. వాటిని తగిన సమయంలో మాత్రమే ప్రస్తావించాలి.” అని శ్రీ నరేంద్ర కుమార్ అభిప్రాయపడ్డారు.
“విషయాలను, వ్యవస్థలోని లోటుపాట్లను, సంఘటనలను ప్రస్తావించే విషయంలో మీడియా అత్యంత జాగరూకతతో వ్యవహరించాలి. వార్తా ప్రసారం విషయాల, సంఘటనల, సమస్యల పట్ల సమాజంలో తగిన అవగాహనను కలిగించేలా ఉండాలి తప్ప భయాందోళనలను రేకెత్తించేలా ఉండరాదు” అని ఆయన పేర్కొన్నారు.
మీడియా ఎవరి అజెండాలలోనూ భాగస్వామి కాకుండా ఉండడం అత్యంత ఆవశ్యకమని, మీడియా నిర్భయంగా నిజాల నిగ్గు తేల్చాలని ఆయన చెప్పారు.
पत्रकारिता का स्वरूप आज जिस प्रकार व्यापक हुआ है उसी प्रकार सब की जिम्मेदारी भी बढ़ी है – मा. नरेंद्र कुमार @NARENDER1970 जी, अखिल भारतीय सह प्रचार प्रमुख, राष्ट्रीय स्वयंसेवक संघ pic.twitter.com/dyO80QiMZV
— NAYAN MANI KUMAR (@satyanusaran) May 31, 2021
“గంగానది ఒడ్డున పాతి పెట్టబడిన మృతదేహాల విషయంలో, ఆ వార్తల ప్రసారంలో ఎలాంటి రాజకీయాలు, రాజకీయ వ్యూహాలు ఉన్నాయో మనకు అవగతమవుతోంది కదా? అలా బయల్పడ్డ కొన్ని ఫోటోలలో 2015, 2017 నాటివి కూడా ఉన్నాయి. వాటిలో…. వర్తమానంలోని దృశ్యాలు కూడా కొన్ని ఉన్నాయన్నది కాదనలేని నిజం. అయితే అవన్నీ కరోనా వల్ల సంభవించిన మరణాలేనా? నిస్సందేహంగా కాదు. ఎందుకంటే 2015, 2017 లలో కరోనా లేదు. కానీ ఎప్పటిలాగే మృతదేహాలు అక్కడ పూడ్చి పెట్టబడ్డాయి. ఆ సమయంలో ఆ విధంగా చాలా మృతదేహాలు వెలికి వచ్చాయి. ఆ దృశ్యాలు అప్పటి నుంచే అందుబాటులో ఉన్నాయి కూడా. కాబట్టి ఈ విధంగా అర్థ సత్యాలను చెప్పడం సబబు కాదు. నిజాలు చూపండి. అంతేగానీ అర్థ సత్యాలను కాదు” అని ఆయన పేర్కొన్నారు.
“అలాంటి సమయాలలో మనం నిజాయితీగా నిజాలను వెలికితీసి వెల్లడించాలి. మనం సకారాత్మక వాతావరణాన్ని నిర్మాణం చేయడంలో క్రియాశీల పాత్ర పోషించాలి. సమాజం యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా, సత్కార్యాలు చేయడానికి అవసరమైన ప్రేరణను ప్రజలకు కల్పించేలా మన చర్యలు ఉన్నప్పుడే మనం మన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించినట్లు అవుతుంది.” అని ఆయన తెలిపారు.
ఈ కరోనా సంక్షోభ సమయంలో ప్రజలు నిర్వహిస్తున్న వివిధ సేవా కార్యక్రమాలకు ప్రచారం కల్పించడంలో మీడియా ముందుండాలని ఆయన సూచించారు.
“మానవ జాతి చరిత్రలో మహమ్మారులను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. ప్లేగు, స్పానిష్ ఫ్లూ వంటి అనేక మహమ్మారులను గతంలో ప్రపంచం ఎదుర్కొంది. ఆ సందర్భాలలో కోట్లాది మంది ప్రజలు ప్రాణాలు విడిచారు. కేవలం స్పానిష్ ఫ్లూ కారణంగానే 10 కోట్ల మంది ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారు. నాడు జరిగిన జన నష్టంతో పోల్చుకుంటే నేడు ఈ కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన, జరుగుతున్న జన నష్టం తక్కువే” అని ఆయన తెలిపారు.
“ఈ ప్రపంచం ఆరు ప్రధానమైన మహమ్మారులను ఎదుర్కొంది. ఆ సమయంలో ముఖ్యంగా యూరోపియన్ దేశాలు తమ జనాభాలో 20 నుంచి 60 శాతం వరకు తమ ప్రజలను కోల్పోవలసి వచ్చింది.” అని ఆయన వెల్లడించారు.
“ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 35 లక్షల మంది మృతి చెందారు. మనదేశంలో అతి స్వల్పంగా 1.23 శాతం మాత్రమే మరణాలు సంభవించాయి. అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, బ్రిటన్, ఇటలీ, బ్రెజిల్ మరియు రష్యా లతో పోలిస్తే మనదేశంలో మరణాలు చాలా తక్కువ. ఈ మహమ్మారిని, ఈ సంక్షోభాన్ని మనం ఒక్కటిగా నిలిచి ఎదుర్కుంటూ ఉండడమే మన బలం” అని ఆయన పేర్కొన్నారు.
Source : Deccan Herald
https://www.deccanherald.com/national/media-should-not-become-part-of-any-agenda-rss-functionary-991850.html