Newsvideos

ఒంగోలులో సేవాభారతి రక్తదాన శిబిరం

650views

ప్రకాశం జిల్లా ఒంగోలులోని AKVK కళాశాలలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సేవా విభాగం సేవాభారతి మరియు మాధవ సేవా సమితుల సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. ప్రస్తుతం నెలకొన్న కరోనా విపత్కర పరిస్థితులలో పలువురు రోగులకు తరచుగా రక్తం అవసరం పడుతూ ఉండడంతో తాము ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలియజేశారు.

ఆర్ ఎస్ ఎస్ సంఘటనా కార్యదర్శి, AKVK కళాశాల ప్రిన్సిపల్ శ్రీ వెంకటేశ్వర రెడ్డి, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీ మల్లికార్జున రావు మరియు సీతారామరాజు తదితరులు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో అనేకమంది ఆర్ ఎస్ ఎస్ మరియు ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొని రక్తాన్ని దానం చేశారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.