Newsvideos

కరోనా బాధితుల సేవలో RSS

615views

రోనా మహమ్మారి నేడు ప్రపంచాన్ని కుదిపేస్తున్నది. సుమారుగా ప్రతి ఇంట్లోనూ కరోనా బాధితులు నేడు మనకు కనిపిస్తున్నారు. ఆర్థిక స్థోమత ఉన్నవారు కూడా కరోనా సోకితే దాని నుంచి తమను తాము రక్షించుకోలేకపోతున్నారు. కాస్తో కూస్తో ఉన్న వారి పరిస్థితే ఇలా ఉంటే అంతగా ఆర్థిక స్తోమత లేని వారి పరిస్థితి ఏమిటి? 1, 2 గదుల ఇరుకు ఇళ్ళు, విడివిడిగా ఉండే సౌక ర్యం ఉండదు, అట్లని లక్షలు కట్టి ఆసుపత్రులలో చేరలేరు, కరోనాతో పొంచి ఉన్న ప్రమాదంపై తగిన అవగాహన ఉండదు. ఆ కారణంగా కుటుంబంలో ఎవరికైనా ఒకరికి కరోనా సోకితే, ఇంట్లో మిగిలిన వారు కూడా దాని బారిన పడుతున్న దురదృష్టకర పరిస్థితి. అలాంటి దురదృష్టకర పరిస్థితుల నుంచి సామాన్యులను బయటపడవేయడం కోసం రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్, విజయవాడ శాఖ నడుం బిగించింది.

కృష్ణాజిల్లా గన్నవరంలో సేవాభారతి మరియు గోపాల్ రావు ఠాకూర్ స్మారక సమితిల ఆధ్వర్యంలో ఒక 50 పడకల ఉచిత కరోనా ఐసొలేషన్ సెంటర్ ప్రభుత్వ అనుమతితో ప్రారంభించబడింది. ఈ కేంద్రం సామాన్యులకు ప్రాణదాన కేంద్రంగా రూపొందించబడింది.

విశాలమైన ప్రాంగణంలో, పరిశుభ్రమైన, ఆహ్లాదకర వాతావరణంలో అన్నిరకాల వసతులతో ఈ ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేయబడింది. 24 గంటల పాటు నిపుణుల పర్యవేక్షణలో ఆధునిక వైద్యము, మందుల తోపాటు మన భారతీయ సాంప్రదాయక పద్ధతిలో యోగాభ్యాసము, ఆరోగ్యకరమైన భోజనము, అన్నిటికంటే ముఖ్యంగా కరోనా బాధితులకు మనో ధైర్యాన్నిచ్చే ఆత్మీయ స్పర్శ ఇక్కడ లభిస్తుంది.

విజయవాడ పరిసర ప్రాంతాలలోని సాధారణ కరోనా లక్షణాలున్న సామాన్యులు ఎవరైనా ఈ కరోనా ఐసోలేషన్ సెంటర్ లో చేరి స్వాంతన పొందవచ్చు. కరోనా నుంచి పూర్తిగా విముక్తం అయిన తర్వాత ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపవచ్చు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.