News

ముస్లిం మతాధికారుల ప్రేరణతో పాకిస్తాన్లోని ఖైబర్ – పఖ్ఖుఖ్వాలోని హిందూ ఆలయాన్ని తగులబెట్టిన ముస్లిం మూకలు

748views

పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లో ఒక హిందూ ఆలయాన్ని ఒక ముస్లిం గుంపు కాల్చివేసింది. ఈ సంఘటన కరాక్ జిల్లాలోని తేరి ప్రాంతంలో జరిగింది.1920 కి ముందు నిర్మించిన ఈ మందిరం చారిత్రాత్మక ప్రార్థనా స్థలం.

కరాక్ ‌కు చెందిన ఒక ముస్లిం మతాధికారి, ఉగ్రవాద సంస్థ యొక్క మద్దతును పొందుతున్నాడు. స్థానిక ముస్లింలను హిందూ సమాజానికి వ్యతిరేకంగా ప్రేరేపించాడని మరియు ఆలయాన్ని కూల్చివేసేందుకు వారిని రెచ్చగొట్టాడని టైమ్స్ ఆఫ్ ఇండియా సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ పేర్కొంది.

హిందూ యాజమాన్యంలోని నిర్మాణంలో ఉన్న ఒక ఇంటిని కూడా ఈ గుంపు కూల్చివేసిందని స్థానికుడు ఒకరు తెలిపారు. హిందూ మందిరాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ సమీప గ్రామాల ముస్లిములు కొందరు నిరసన ప్రదర్శనను నిర్వహించారని స్థానికులు వెల్లడించారు. పోలీసులు దీనిని పూర్తిగా విస్మరించారు. ఏమాత్రం భద్రతా చర్యలు చేపట్టలేదు.

ఘటనపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కలవరపెట్టేదిగా ఉంది. ఆ విజువల్స్ ఆ స్థలంలో పెద్ద సంఖ్యలో నిరసనకారులు ఉన్నట్లు చూపించాయి. పొగ మరియు మంటలు కనిపించాయి. ఆలయం గోడలు దగ్ధమైపోతున్న దృశ్యాలు కనిపించాయి. కరాక్ జిల్లా పోలీసు అధికారులు ఈ సంఘటనను ధృవీకరించారు.

“స్థానికులు నిరసన కోసం పిలుపునిచ్చినప్పుడు అది శాంతియుతంగా ఉంటుందని హామీ ఇచ్చారు. అయినప్పటికీ, మతాధికారులు ప్రజలను హింసకు ప్రేరేపించారు. తరువాత వారు ఈ మందిరంపై దాడి చేశారు” అని కరాక్ జిల్లా పోలీసు అధికారి ఇర్ఫానుల్లా చెప్పారు.

Source : Swarajaya

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.