
కర్నూలు జిల్లా శ్రీశైలంలోని భక్త కన్నప్ప ఆవాసం (హాస్టల్) స్థాపకులు శ్రీ మల్లిఖార్జున శర్మ స్వర్గస్తులయ్యారు. నిరుపేద చెంచు బాలబాలికలకు ఉచిత వసతి, భోజనం, విద్య అందించే సదాశయంతో స్వర్గీయ మల్లిఖార్జునరావు ఎన్నో ఇబ్బందులకు ఓర్చి ఆ హాస్టల్ ను ప్రారంభించారు. చెంచు బాల బాలికలకు చదువు, సంస్కారాలనందించాలని, వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఆయన అహరహమూ తపించారు.
భక్త కన్నప్ప ఆవాసం
పిల్లలకు వృత్తి విద్య నేర్పించే వర్క్ షాప్
మల్లిఖార్జున శర్మ గారు కర్నూలు జిల్లాలో సీనియర్ ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త. గత రెండు దశాబ్దాలుగా కర్నూలు జిల్లా గోకవరంలో భక్త కన్నప్ప ఆవాసం (ఉచిత హాస్టల్) చెంచుల విద్యార్థుల వికాసం కొరకు ఏర్పాటు చేశారు. వారు కన్నప్ప ఆవాసానికి కార్యదర్శిగా ఉంటూ ఎన్నో సేవలు అందించారు. విద్యార్థులకు చదువుతోపాటు నైపుణ్య విద్యను కూడా నేర్పించి, వారికి చదువుతోపాటు కొంత ఆదాయం కలిగించి, వృత్తి విద్యలైన ఎలక్ట్రికల్, కార్పెంటరీ, వెల్డింగ్ ఇలాంటి పనులు నేర్పి చదువుతో పాటు కొంత సంపాదన వచ్చే విధంగా ప్రయత్నం చేశారు. చదువు అయిన తర్వాత ఆ డబ్బు వారికే ఇచ్చి వాళ్ళ కాళ్లపై వారు నిలబడేలా విధంగా ప్రయత్నం చేశారు.