NewsSeva

తన సాహసంతో ఒక గ్రామాన్నే కాపాడిన ఆర్ ఎస్ ఎస్ స్వయంసేవక్

1.7kviews

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన శ్రీ కేతా శ్రీధర్ రెడ్డి (వెంకటేశ్వర్లు రెడ్డి) ఒక ఆరెస్సెస్ కార్యకర్త (కొత్తపల్లి ఉప మండల కార్యవాహ). నివర్ తుఫాన్ సృష్టించిన విధ్వంసంలో ఒంటరిగా అత్యంత ధైర్యసాహసాలు, తెగువ ప్రదర్శించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. కొత్తపల్లి-కచ్చిరిదేవరాయపల్లి మార్గంలో కొమ్మలేరు ఉధృతి( 51/2అడుగులు) ఒకవైపు, పెన్నా(3లక్షల క్యూసెక్కులు) ఉధృతి మరో వైపు. ఆ రెండు గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయ్. రాక పోకలు ఆగిపోయాయ్. ప్రభుత్వాధికారులు సహాయక చర్యలు చేపట్టడానికి కూడా ఆ గ్రామాలకు చేరుకోలేని పరిస్థితి.

ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ప్రభుత్వాధికారులు, సిబ్బంది, గ్రామస్థులు అందరూ వారిస్తున్నా కూడా, ఒంటరిగా ముందుకు నడుస్తూ, పోలీసు, ప్రభుత్వ శాఖలకు మార్గదర్శనం చేస్తూ ముందుకు సాగిపోయారు శ్రీధర్ రెడ్డి. కచ్చిరిదేవరాయపల్లి గ్రామానికి చేరుకుని సుమారు 200మందిని కొత్తపల్లి పునరావాస కేంద్రానికి చేర్చారు. తన స్నేహితులతో కలిసి 27 వ తేది సాయంత్రంనుండి 29వ తేది సాయంత్రం వరకు తమ స్వంత నిధులతో పునరావాస కేంద్రంలోని వారికి అన్ని వసతులూ సమకూర్చారు. గ్రామాల పర్యవేక్షణకు వచ్చిన రాష్ట్ర మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి విషయం తెలుసుకుని శ్రీ శ్రీధర్ రెడ్డిని ప్రశంశించారు. ఆర్ఎస్ఎస్ అంటే సమాజహితం కోసమేనని మరోసారి నిరూపించారు శ్రీ శ్రీధర్ రెడ్డి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.