News

మతమార్పిడి వ్యతిరేక బిల్లు పరిధిలో UP లో నమోదైన మొదటి కేసు

318views

త్తరప్రదేశ్ మతమార్పిడి వ్యతిరేక బిల్లు గవర్నర్ ఆనందిబెన్ పటేల్ గారి ఆమోదం పొందిన కొద్ది గంటలలోనే మొదటి కేసు నమోదు అయింది. ఉత్తరప్రదేశ్ లోని పోలీస్ స్టేషన్ లో అమ్మాయి తండ్రి ఫిర్యాదు మేరకు శనివారం రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

వివరాల్లోకి వెళితే ఉవైస్ అహ్మద్ అనే 22 సంవత్సరాల యువకుడు 20 సంవత్సరముల యువతిని కిడ్నాప్ చేసి, మతం మారుస్తానని బెదిరిస్తున్నట్లు వెలుగులోనికి వచ్చింది. అతను ఆ అమ్మాయికి పాఠశాల సమయం నుండి పరిచయం ఉన్నట్టు తెలిసింది. ఆ యువతికి ప్రస్తుతం వేరొకరితో వివాహమైంది. గత సంవత్సరం యువతి ఆ ముస్లిం యువకునితో పారిపోవడానికి ప్రయత్నించిన ట్లు పోలీసులు నిర్ధారించారు.

ఇది నూతన చట్ట పరిధిలో నమోదైన మొదటి కేసని బరేలీ డీ ఐజీ రాజేష్ కుమార్ తెలియజేశారు. యువతి తండ్రి తన కూతురిని ఆ యువకుడు గత మూడు సంవత్సరాలుగా బెదిరిస్తున్నట్లు తెలిపాడు. మతమార్పిడి వ్యతిరేక బిల్లు సెక్షన్ 3 /5 తో పాటు 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు, అడిషనల్ యస్ పి (రూరల్ ) సన్సార్ సింగ్, టైమ్స్ ఆఫ్ ఇండియా కు తెలియజేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.