News

శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

46views

శ్రీవారి బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ముక్కోటి దేవతలు, భక్తకోటిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ శుక్రవారం సాయంత్రం అంకురార్పణ నిర్వహించారు. దీనికి సంబంధించిన వైదిక కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. శనివారం సాయంత్రం 6.03 గంటల నుంచి 6.30గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించనున్నారు. ధ్వజారోహణం అనంతరం వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. రేపు రాత్రి 8.30గంటల నుంచి 9.30గంటల వరకు పెద్ద శేషవాహన సేవ నిర్వహించనున్నారు. కరోనావల్ల ఈసారి ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అంకురార్పణ కార్యక్రమంలో తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. మరోవైపు, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా శ్రీవారి ఆలయం, తిరుమల ప్రవేశ మార్గాలు, కూడళ్లలో అలంకరణలు చేశారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.