
285views
జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దయిపోయి ఆగస్టు 5 నాటికి ఏడాది పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ఆ రోజును బ్లాక్ డేగా పాటించాలని పీడీపీ పిలుపునిచ్చింది. జమ్ముకశ్మీర్ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సున్నిత ప్రాంతాల్లో అల్లర్లు జరిగేందుకు అవకాశమున్నందున ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. మంగళ, బుధవారాల్లో శ్రీనగర్‌లో కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. మరోవైపు కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా అమల్లో ఉన్న నిబంధలను ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు పొడిగించింది.