News

లోక కళ్యాణం కోరుతూ హిందూ చైతన్య వేదిక పూజలు

588views

న పూర్వికులు గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా ఉండాలని తగుజ్రాగత్తలు తీసుకునేవారు, ఆ జ్రాగత్తలన్నీ భక్తి పేరుతో గ్రామదేవతలకు పూజా విధానాల్లో నిక్షప్తం చేసి తర్వాతి తరాలకు అందించారు. అందుకే భారతీయుల ప్రతీ అడుగులో సైన్స్ దృక్పథం స్పష్టంగా ప్రతిఫలిస్తూ ఉంటుందనడంలో ఏమాత్రం సందేహంలేదు. కరోనా మహమ్మారి వ్యాప్తి విజృంభించిన ఈ సమయంలో గ్రామదేవతలకు పూజలు నిర్వహించడం ద్వారా మన పూర్వీకులు సూచించిన శుచి శుభ్రతను ఆచరించడం వలన కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండేలా జాగ్రత్త పడవచ్చు. ఈరోజు హిందూ చైతన్య వేదిక కొవ్వూరు పట్టణ శాఖ, పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గ్రామదేవత కొవ్వూరమ్మ తల్లికి కరోనా మహమ్మారి నుంచి మనదేశంలోని ప్రజలందరినీ కాపాడాలని అమ్మవారికి పుజాచేసి చీర, కుంకుమ మరియు దీప ధూప నైవేద్యం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ కార్యదర్శి మద్దుకూరి నాగసాయి, ప్రాంత ప్రచార ప్రముఖ్ యంట్రప్రగడ కాంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో సభ్యులు శ్రీ అనపర్తి శివరామకృష్ణ, శ్రీ ఆకుల పవన్, శ్రీ మద్దుకూరి గణేష్, శ్రీ పిల్లలమర్రి మురళీకృష్ణ, శ్రీ కొప్పాక జవహర్, శ్రీ పిక్కినాగేంద్ర పాల్గోనటం జరిగింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.