
508views
భారతీయ జనతా పార్టీ (భాజపా) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ పార్టీ ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు నియమితులయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ అరుణ్‌సింగ్ ఉత్తర్వులు వెలువరించారు. వీర్రాజు నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం భాజపా ఏపీ అధ్యక్షుడిగా శ్రీ కన్నా లక్ష్మీనారాయణ కొనసాగుతున్నారు. ఏపీ, తెలంగాణ శాఖలకు కొత్త అధ్యక్షులు నియమితులవుతారని ఎప్పుటి నుంచో వార్తలు వస్తున్నాయి. తెలంగాణకు ఈ ఏడాది శ్రీ బండి సంజయ్‌ను అధ్యక్షుడిని చేయగా కొన్ని నెలల వ్యవధిలోనే ఏపీకి కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియమితులయ్యారు.