News

ఇటు ముగ్గురైతే అటు ఐదుగురు – అదీ లెక్క

798views

ఇండో చైనా సరిహద్దులలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రాత్రి జరిగిన ఘర్షణలలో ఒక భారత సైనిక అధికారి తోపాటు ఇద్దరు సైనికులు కూడా వీర మరణం పొందిన సంగతి మనకు తెలిసిందే. అయితే చైనా వైపు కూడా అంతకుమించిన ప్రాణ నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది.

లడక్ సరిహద్దులలోని గాల్వన్  లోయలో భారత్, చైనా దళాల మధ్య రాత్రి జరిగిన ఘర్షణలో ఐదుగురు చైనా సైనికులు మృతి చెందారని, సుమారు పదకొండు మంది తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. ఈ మేరకు IFE వార్తా సంస్థ సమాచారం వెలువరించింది. వాంగ్ వెన్వెన్ అనే చైనా జర్నలిస్ట్ కూడా ఈ మేరకు ట్వీట్ చేసినట్లుగా తెలుస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.