News

భారత్ చైనాల సరిహద్దు ఉద్రిక్తతలపై జరగనున్న కీలక చర్చలు

505views

భారత్, చైనా సరిహద్దుల వద్ద నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో నేడు ఇరుదేశాల సైనికాధికారుల మధ్య జరగనున్న చర్చలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. చైనా, లడ్డాక్ లో సైనిక బంకర్లు ఏర్పాటు చేయడం తో పాటు, సరిహద్దుల వద్ద పెద్ద ఎత్తున సైనికులను, ఆయుధాలను మోహరించిన సంగతి పాఠకులకు విదితమే. ఈ నేపథ్యంలో మే 5వ తారీఖున ఇరు దేశాల సైనికుల మధ్య పాంగాంగ్ వద్ద జరిగిన గొడవలో ఇరుపక్షాలకు చెందిన సుమారు 200 మంది సైనికులు గాయపడ్డారు. అనంతరం మే 9వ తారీఖున మరలా జరిగిన గొడవలో మరో 10 మంది సైనికులకు గాయాలయ్యాయి.

ఈ విషయమై ఇరు దేశాలకు చెందిన లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల మధ్య ఈ సమావేశం జరుగనున్నది. తూర్పు లడ్డాఖ్ లోని చుసుల్ – మోల్డో సరిహద్దు వద్ద ఇరుదేశాల సైనికాధికారులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పాల్గొనే భారత సైనికాధికారుల బృందానికి 14 కాప్స్ కమాండర్ కెప్టెన్ హరిందర్ సింగ్ నేతృత్వం వహించనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.